Header Banner

రెండో పెళ్లికి సమంత రెడీ.. ఫిలిం న‌గ‌ర్‌లో హాట్ టాపిక్! ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

  Sat Apr 19, 2025 18:41        Cinemas

ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు. బాలీవుడ్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. స‌మంత హీరోయిన్‌గానే కాకుండా నిర్మాత‌గా కూడా ప్ర‌య‌త్నిస్తుంది. సామ్ ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం టీజర్ ఇటీవ‌ల విడుద‌లై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘త్రాలాలా మూవింగ్ పిక్చ ర్స్’ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి తొలి చిత్రంగా ‘శుభం మూవీని ప్రేక్షకుల ముందుకు తెస్తుంది. అయితే గ‌త కొద్ది రోజులుగా స‌మంత రెండో పెళ్లికి సంబంధించి చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్‌ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది.

వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటార‌ని అంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం స‌మంత‌, రాజ్‌ల పెళ్లి మేలో ఉంటుంద‌ని ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఇరు కుటుంబ స‌భ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని , ఇక పెళ్లి జ‌ర‌గ‌డమే త‌రువాయి అని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కాని, ప్ర‌స్తుతం ఈ వార్త ఇంట‌ర్నెట్‌లో కూడా తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. నాగ చైత‌న్య ఇప్ప‌టికే శోభిత‌ని వివాహం చేసుకొని సంతోషంగా వైవాహిక జీవితం గ‌డుపుతుంది. కాని చైతూ నుండి విడిపోయిన‌ప్ప‌టి నుండి స‌మంత సింగిల్‌గానే ఉంటుంది. ఆమె పెళ్లికి సంబంధించి ఎన్నో వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నా కూడా దీనిపై స‌మంత ఇంత వ‌ర‌కు స్పందించింది లేదు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Samantha #SecondMarriage #FilmNagar #HotTopic #Bollywood #WeddingRumors